తర్వాత వాటిని బీమా కంపెనీకి సమర్పిస్తూ, హనీఫ్ భార్య రెహానా, కుమారుడు ఇక్బాల్ పరిహారం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, వారి వ్యవహారాన్ని అనుమానించిన సదరు బీమా సంస్థ దేవాస్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి బాగోతం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు చేపట్టిన దర్యాప్తులో హనీఫ్ బతికి ఉన్నట్టుగా గుర్తించారు. దీంతో హనీఫ్, రెహానా, ఇక్బాల్‌తోపాటు మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించిన వైద్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.