వారిని దోషులుగా తేల్చడమే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య : మనీశ్ సిసోడియా

ఆదివారం, 6 సెప్టెంబరు 2020 (13:46 IST)
కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బాలీవుడ్ నటుడు సుశాంత్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియా చక్రవర్తి కుటుంబాన్ని అరెస్టు చేయడమే అజెండాగా కేంద్రంతో పాటు మీడియా 24 గంటల పాటు పనిచేస్తోందని, ఇదే దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యగా ఉందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. 
 
సుశాంత్ సింగ్ మృతి కేసులో త‌న కొడుకు అరెస్టు సంద‌ర్భంగా కంగ్రాట్స్ ఇండియా అని మాజీ ఆర్మీ డాక్ట‌ర్ రియా చ‌క్ర‌వర్తి తండ్రి భావోద్వేగ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. నెక్స్ట్ టార్గెట్ తన కుమార్తె అంటూ ట్వీట్ చేశారు. దీనిపై మనీష్ సిసోడియా ఈమేర‌కు ట్వీట్ చేశారు. 
 
దేశంలో ప్ర‌ధాన‌మైన స‌మ‌స్య‌ల‌న్నింటిని గాలికొదిలేసిన కేంద్రం.. ఓ వ‌ర్గం మీడియా సుశాంత్ రాజ్‌పుత్ మ‌ర‌ణం కేసులో బాలీవుడ్ న‌టి రేహా చక్రవర్తి, ఆమె కుటుంబ స‌భ్యుల విచార‌ణ చుట్టే తిరుగుతున్నాయ‌న్నారు. కేంద్ర ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలను క‌ప్పిపుచ్చుకోవ‌డానికి, ప్ర‌జ‌ల దృష్టి మళ్లించ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం ఈ కేసును వాడుకుంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
జూన్ 14వ తేదీన‌ సుశాంత్ సింగ్ చ‌నిపోయిన‌ప్ప‌టి నుంచి మీడియాలో అదే ప్ర‌ధాన అంశంగా నిలుస్తుంద‌న్నారు. ప్ర‌జ‌ల దృష్టిని మ‌ర‌ల్చ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం - మీడియా 24 గంట‌లు ప‌నిచేస్తున్నాయ‌ని విమర్శలు గుప్పించారు. 
 
ఈ కేసులో రియా, ఆమె మొత్తం కుటుంబాన్ని దోషులుగా తేల్చ‌డమే ప్ర‌స్తుతం దేశం ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య అనేలా కేంద్ర‌ప్ర‌భుత్వం, అదిచెప్పిన‌ట్లు వినే మీడియా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఈమేర‌కు ఆయ‌న ప్ర‌ధాని మోడీ ప్ర‌ధాన వాగ్ధానాల్లో కొన్నింటిని పేర్కొంటూ ట్వీట్ చేశారు.
 
చైనా ఆక్ర‌మించుకున్న భారత భూభాగాన్ని విడిచిపెట్టింది, దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ ఐదు ట్రిలియన్లు దాటేసింది, కోట్ల‌లో ఉద్యోగాలు వ‌చ్చేశాయి, రైతులు, వ్యాపారులు అత్య‌ధిక లాభాల‌ను ఆర్జించారు, స్వ‌చ్ఛ భార‌త్, డిజిట‌ల్ స్కిల్ ఇండియా విజ‌య‌వంతంగా పూర్తయ్యాయి. ఇక దేశంలో మిగిలింది కేవల రియా చ‌క్ర‌బ‌ర్తి, ఆమె కుటుంబం అరెస్టు మాత్ర‌మే అంటూ మనీశ్ సిసోడియా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు