మన్మోహన్ కోసం మనం అందరం ప్రార్థిద్దాం : కాంగ్రెస్

శుక్రవారం, 15 అక్టోబరు 2021 (17:12 IST)
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కోసం మనమంతా ప్రార్థనలు చేద్దాం అంటూ కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారనీ ఆ పార్టీ సీనియర్ నేత ప్రణవ్ ఝా తెలిపారు. 
 
మన్మోహన్ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనుకావడంతో ఆయన్ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే. ఆయన ఆరోగ్యం గురువారం కంటే శుక్రవారం కాస్త మెరుగుపడిందని తెలిపారు. 
 
ఆయన త్వరగా కోలుకోవాలని అందరం ప్రార్థిద్దామని కోరారు. మన్మోహన్ ఏకాంతాన్ని అందరం గౌరవిద్దామని విన్నవించారు. అనవసరమైన ఊహాగానాలకు ఎవరూ తావివ్వొద్దని కోరారు.
 
మన్మోహన్ సింగ్ ఇటీవలే జ్వరం బారిన పడ్డారు. చికిత్స తర్వాత ఆయన కోలుకున్నారు. అయితే నీరసంగా ఉండటంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు. 
 
కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ఎయిమ్స్ ఆసుపత్రికి వెళ్లి మాజీ ప్రధాని ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. మరోవైపు మన్మోహన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు