కాగా.. కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు తమ ఆస్తుల విలువకు సంబంధించిన అఫిడవిట్‌తో పాటు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఇంతలో, కర్ణాటక మంత్రి ఎంటిబి నాగరాజ్ ప్రకటించిన భారీ సంపద కారణంగా ఆయన అఫిడవిట్ వైరల్‌గా మారింది.
ఎంటీబీ నాగరాజ్ ఎవరు?
ఎం నాగరాజ్ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. తాను 9వ తరగతి వరకు చదువుకున్నానని.. తన ఆదాయానికి మూలం వ్యవసాయం, తండ్రి ఆస్తులు, వ్యాపారం అని ప్రకటించారు.
ఎం నాగరాజ్ 2018లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హోస్కోట్ స్థానం నుంచి గెలుపొందారు. అయితే, మరుసటి ఏడాది ఆయన కాంగ్రెస్‌ను వీడారు. 2019లో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కూలిపోవడానికి కారణమైన 17 మంది ఎమ్మెల్యేలలో ఆయన ఒకరు.