అబార్షన్ కోసం వెళ్లే బాలిక వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనిలేదు..

శనివారం, 1 అక్టోబరు 2022 (09:25 IST)
అబార్షన్లపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించిన నేపథ్యంలో.. అబార్షన్ కోసం తమ వద్దకు వచ్చే బాలిక వివరాలను పోలీసులకు చెప్పాల్సిన పనిలేదంటూ సుప్రీం కీలక తీర్పు తెలిపింది. ఈ మేరకు పోక్సో చట్టంలోని సెక్షన్ నుంచి వైద్యులకు రక్షణ కల్పించింది. 
 
సుప్రీం ధర్మాసనం ఇచ్చి ఈ తీర్పుపై సర్వత్ర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. తాజా తీర్పు నేపథ్యంలో అవాంఛిత గర్భాన్ని తీయించుకునేందుకు బాలికలు ఇకపై కోర్టుల చుట్టూ తిరగాల్సిన బాధ తప్పుతుంది.
 
24 వారాల్లోపు దేశంలోని మహిళలందరూ సురక్షిత గర్భవిచ్ఛిత్తి చేసుకోవంటూ గురువారం కీలక తీర్పు వెల్లడించిన సుప్రీంకోర్టు.. బాలికల విషయంలోనూ ఈ తీర్పును విస్తరించింది.
 
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) చట్టపరిధిని బాలికలకు విస్తరిస్తూ.. వారు కూడా 24 వారాల్లోపు అబార్షన్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో వైద్యులకు కూడా రక్షణ కల్పించింది. బాలికల అబార్షన్‌కు అడ్డుగా ఉన్న పోక్సో చట్టంలోని సెక్షన్ 19(1) నుంచి వైద్యులకు రక్షణ కల్పిస్తూ కీలక తీర్పు వెలువరించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు