చెన్నైలో మిర్రర్ నౌ జర్నలిస్టుపై దాడి.. ముక్కు పగిలిపోయేలా పిడిగుద్దులు (వీడియో)

మంగళవారం, 4 డిశెంబరు 2018 (15:07 IST)
తమిళనాడు రాష్ట్ర రాజ్‍భవన్ సాక్షిగా మిర్రర్ నౌ ప్రమోద్ మాధవ్ అనే జర్నలిస్టుపై డీఎంకే కార్యకర్తలు దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రమోద్.. ప్రస్తుతం చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 
 
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ముద్దాయిలుగా తేలి శిక్ష అనుభవిస్తున్న నిషేధిత ఎల్టీటీటీ సానుభూతిపరులను విడుదల చేయాలని చేయాలని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ మేరకు అధికార అన్నాడీఎంకే కూడా ఓ తీర్మానం చేసి గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ ఆ ముద్దాయిల విడుదలపై నిర్ణయం తీసుకోకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు. 
 
గవర్నర్ చర్యను ఖండిస్తూ వైగో సారథ్యంలోని ఎండీఎంకే సోమవారం రాజ్‌భవన్ ఎదుట ధర్నాకు చేసింది. ఈ ధర్నాకు అనేక మంది కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు మిర్రర్ నౌ జర్నలిస్టు ప్రమోద్ మాధవ్ కూడా వచ్చాడు. అతను ఓ టీ దుకాణం వద్ద తేనీరు సేవిస్తుండగా, ఉన్నట్టు డీఎంకే కార్యకర్త ఒకరు అతనిపై దాడికి దిగాడు. పిడిగుద్దులు కురిపించాడు. 
 
సైదాపేట నియోజకవర్గానికి చెందిన సురేష్ సురేష్ బాబు డీఎంకే కార్యకర్తగా గుర్తించి, సోమవారం అరెస్టు చేశారు. అయితే, పోలీసులు మాత్రం సురేష్ బాబు డీఎంకే కార్యకర్త అని మాత్రం ధృవీకరించక పోవడం గమనార్హం. ఇదే అంశంపై గిండీ పోలీసు స్టేషన్‌కు చెందిన పోలీస్ అధికారి ఒకరు స్పందిస్తూ, ఆ వ్యక్తి స్థానికుడని, ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తికాదని చెప్పాడు. ప్రస్తుతం అరెస్టు చేశామని, అతన్ని నుంచి వివరాలు సేకరించి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేస్తామని తెలిపారు. 
 
కాగా, ఈ దాడిలో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు. ముక్కు, కంటిపై బలమైన గాయాలు తగిలాయి. ముక్కు విరిగింది. అతనికి రాయపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 
 

& this is how my friend @madhavpramod1 was attacked when he tried to take the video of #DMK party cadre tried to create ruckus at a tea shop in Chennai during #MDMK protest pic.twitter.com/lKHdCHj8xK

— Sanjeevee sadagopan (@sanjusadagopan) December 3, 2018

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు