రైతన్నలకు శుభవార్త చెప్పిన వాతావరణ శాఖ...

మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (17:26 IST)
రైతన్నలకు వాతావరణ శాఖ తీపి కబురు చెప్పింది. ఈ యేడాది ఊహించినదానికంటే వర్షాలు అదనంగా కురుస్తాయంటూ ఐఎండీ వెల్లడించింది. ఈ తరుణంలోనే మరో శుభవార్త వినబడింది. ఈ సంవత్సరం అనుకున్న సమయం కంటే ముందుగానే వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. 
 
తూర్పు బంగాళాఖాతంలో ముందే ఏర్పడుతున్న ఉపరితల ద్రోణులు అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ భావిస్తోంది. శ్రీలంకకు ఆగ్నేయ దిశగా హిందూ మహాసముద్రం, దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనాలు ముందుగానే ఏర్పడతాయని అంచనా వేసింది. ఆ యేడాది సకాలంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రైతులకు శుభవార్త తెలిపింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు