ఈ సోదాలు పక్కా సమాచారంతో దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉన్న డ్యాన్స్ బార్పై బుధవారం రాత్రి పోలీసులు అకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్ యాజమాన్యానికి చెందిన 9 మంది, ఆరుగురు కస్టమర్లను పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టు అయినవారిలో వ్యాపావేత్తలు, ప్రభుత్వ అధికారులు, ఇతర ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నారు. బార్లోని మహిళా సిబ్బందిని వదిలేశామని పోలీసులు చెప్పారు. నిందితులను కోర్టు ముందు హాజరపరచి, బెయిల్పై విడుదల చేశామని సీనియర్ పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.