ఈ వివరాలను పరిశీలిస్తే, ముంబైకు చెందిన ఓ యువతి కిడ్నీ వ్యాధిబారినపడి ముంబై నగర పాలక సంస్థ ఆధ్వర్యంలోని సియాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూవస్తోంది. ఈమెకు సహాయంగా ఉండేందుకు అక్క వచ్చి ఆస్పత్రిలోనే ఉంటోంది. రోగి వద్ద ఉంటున్న మహిళపై ఓ యువకుడు కన్నేశాడు. ఆమెతో మాటామాటా కలిపి దగ్గరయ్యాడు. ఆ తర్వాత మాయమాటలు చెప్పి లైంగికదాడికి ప్లాన్ చేశాడు.
ఈ క్రమంలో ఆస్పత్రిలో పైఅంతస్తులో ఉన్న విభాగంలో ఫామ్ నింపితే మందులు, చికిత్సలో రాయితీ ఇస్తారని నమ్మించిన నిందితుడు... ఆమెను డాబాపైకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు శారీరకంగా బలహీనంగా ఉండటంతో... అతడి నుంచి తప్పించుకోలేకపోయింది.
పైగా, తనకు హెచ్‌ఐవీ వ్యాధి సోకివుందని చెప్పినా ఆ కామాంధుడు వినిపించుకోలేదు. ఆమె పట్ల పశువులా ప్రవర్తిస్తూ, తన లైంగికవాంఛ తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ మహిళను అక్కడే వదిలిపెట్టి ఆ కామాంధుడు పారిపోయాడు. పిమ్మట అత్యాచార బాధితురాలు సమీపంలోని పోలీస్ స్టేషన్‌కెళ్లి ఫిర్యాదు చేసింది.