మహిళలపై వావివరుసలు, వయోబేధాలు లేకుండా అకృత్యాలు జరుగుతున్నాయి. నిర్భయ లాంటి చట్టాలొచ్చినా.. కామాంధుల ఆగడాలు తగ్గట్లేదు. లాక్ డౌన్‌లోనూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇలా మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్న వ్యక్తికి జైలు ఖాయమైంది.
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన అబు అబ్దుల్ రెహ్మాన్ అనే 30 ఏళ్ల వ్యక్తి.. 2018 జూన్ 29న అదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలికను ముద్దు పెట్టుకున్నాడు. దీంతో ఆ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.