తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదసంస్థ జైషే మహ్మద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇటీవల ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వద్ద రెక్కీ నిర్వహించినట్టు పోలీసులకు సమచారం వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి ఆ ఉగ్రవాది కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పైగా నగరంలో హైఅలెర్ట్ ప్రకటించారు.
ఈ క్రమంలో ఈ కేసుతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వీరంతా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. వీరివద్ద జరిపిన విచారణలో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్టు ఉగ్రవాదులు వెల్లడించారని నగర పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ వెల్లడించారు. తొలుత జమ్మూకాశ్మీర్‌కు ఓ యువకుడుని అరెస్టు చేసి విచారించగా, అతను ఇచ్చిన నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు.