'2019లో భారతదేశ ప్రధాని' అనే అంశంపై యూత్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో మెజారిటీ ప్రజలు తిరిగి మోడీనే పీఎం కావాలని కోరుకున్నారు. న్యూస్ యాప్ ఇన్‌షార్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్సాస్ సంయుక్తంగా ఈ ఆన్‌లైన్ సర్వేను నిర్వహించాయి.
2019లో మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు 70 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. తాము తిరిగి ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని వారంతా స్పష్టం చేశారు. అలాగే 64 శాతం మంది మహిళలు కూడా మోడీకి మద్దతు పలికారు. ఈ సర్వేలో మొత్తం 63,141 మంది పాల్గొన్నారు. 70 శాతం మంది మోదీకి జైకొట్టగా 17 శాతం ‘నో’ అన్నారు. 13 శాతం తాము ఇంకా ఏ విషయం తేల్చుకోలేదని సమాధానమిచ్చారు.