బిగ్ బాస్ 5లో రచ్చ రోజురోజుకూ పెరుగుతోంది. సోమవారం, మంగళవారం ఎపిసోడ్‌లు ప్రేక్షకులకు షాక్ ఇచ్చాయి. ప్రత్యేకించి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు నెమ్మదిగా బయట పడుతున్నాయి. ఒక్కొక్కరుగా ముసుగు తొలగిస్తుండడంతో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం రాజుకుంటోంది. అసభ్యకర కామెంట్స్ కారణంగా నెటిజన్లు ఉమాదేవిపై, పొగరుగా బిహేవ్ చేసినందుకు శ్వేత వర్మపై కూడా ఫైర్ అయ్యారు.
శ్వేత వర్మ లోబో ఫ్రెండ్షిప్ బ్యాండ్‌ని విసిరి అతడిని ఫేక్ అని పిలిచింది. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ అనీ పట్ల ఉమా దేవి అగౌరవంగా, అమానవీయంగా ప్రవర్తించినందుకు ఆమెనూ విమర్శించింది. రెండవ వారం నామినేషన్స్ ప్రక్రియ సోమవారమే ముగిసినప్పటికీ ఇంకా అదే చర్చనీయాంశం అవుతోంది. నిన్న కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గేమ్ కూడా కొట్టుకోవడానికే అన్నట్టుగా ఆడారు.