దేశంలోని వైద్య విద్యా కోర్సుల ప్రవేశానికి జాతీయ స్థాయిలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. గత యేడాది నిర్వహించిన పరీక్షల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ యేడాది నిర్వహించే పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహిస్తారంటూ ప్రచారం జరిగింది. దీనిపై ఎన్టీఏ వివరణ ఇచ్చింది. 2025 మే నెలలో నిర్వహించే ప్రవేశ పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానంలో నిర్వహించనున్నారు.
ఒకేరోజు, ఒకే షిఫ్ట్ పరీక్ష నిర్వహిస్తారు. జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) మార్గదర్శకాల ప్రకారం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్డీఏ) ప్రకటించింది. నీట్-2025ను ఓఎంఆర్ విధానంలో నిర్వహిం చాలా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించాలా? అనే విషయంలో కేంద్ర విద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖలు నెలరోజులుగా మల్ల గుల్లాలు పడ్డాయి.