ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్‌గా పిలవబడే ఈ వైరస్ వల్ల ఇప్పటికే అస్సాంలో దాదాపు 15 వేల పందులు మృత్యువాతపడ్డాయి. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఆ వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. దీనితో ఆక్కడి ప్రభుత్వం వ్యాధి మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేలా పందులను సామూహికంగా చంపేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో పెరుగుతోన్న ఈ సంక్షోభం తీవ్ర ఆందోళనను కలగజేస్తోంది. రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ 10 జిల్లాలకు వ్యాపించింది. దాదాపు 14,919 పందులు చనిపోయాయి. తాము ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని ఆ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి అతుల్ బోరా చెప్పారు.
ఈ వ్యాధి జంతువుల నుండి జంతువులకే వ్యాపిస్తుందని.. మనుషులకు వ్యాప్తి చెందని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఈ వ్యాధి భారత్‌లో వ్యాపించడం తొలిసారి కాగా.. చైనా నుంచి ఈ వైరస్ వ్యాప్తి చెందినట్లు అస్సాం మంత్రి పేర్కొన్నారు.