500, 1000 నోట్లు రద్దయిన వెంటనే దేశంలో కలకలం రేగింది. ముఖ్యంగా టోల్ గేట్ల వద్ద చిల్లర లేక, వాహనాలు జామ్ అయిపోయాయి. వెంటనే స్పందించిన కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కారీ నవంబరు 14 వరకు టోల్ ఎత్తి వేశారు. కానీ, ఇంకా నోట్ల సర్దుబాటు కాకపోవడంతో ఈ గడువును మరో నాలుగు రోజులు పొడిగించారు. టోల్ గేట్స్ వద్ద నవంబర్ 18 వరకు వాహనదారుల నుండి టోల్ టాక్స్ వసూల్ చేయవద్దని కేంద్ర మంత్రి గడ్కారీ తన ట్విటర్లో తాజాగా తెలియజేశారు.