వివరాల్లోకి వెళితే... కేరళలోని మల్లాపురంలోకి గర్భంతో ఉన్న ఏనుగు రావడంతో కొందరు ఆకతాయిలు దుర్మార్గంగా ఆలోచించి క్రాకర్లను ఓ పైనాపిల్‌లో కుక్కి నిప్పు పెట్టారు. దాన్ని ఏనుగు నోట్లో పెట్టారు. వాళ్లు ఎంత దుర్మార్గంగా చేస్తున్నారో గ్రహించలేకపోయిన ఏనుగు... ఆ పైనాపిల్‌ను నోట్లోకి తీసుకుంది. అంతే.. భారీ శబ్ధంతో పేలింది. ఏనుగు నోరు, నాలుక పూర్తిగా దెబ్బతింది. నాశనమైంది. అప్పటికే ఆ ఏనుగు పొట్టలో 18 నెలల గున్న ఏనుగు కూడా ఉంది.
కాలిన నోటితో ఆ ఏనుగు కేకలు పెడుతూ... ఊరి సందుల్లో అటూ ఇటూ తిరిగింది. ఏదీ తినలేకపోయింది. గాయాల నొప్పి, బాధతో ఆ ఏనుగు చివరకు వెల్లియార్ నదిలోకి వెళ్లింది. అక్కడ నీరు తాగింది. ఆ తర్వాత నదిలోనే నిల్చొని చనిపోయింది.
ఇక క్రికెటర్ విరాట్ కోహ్లీ దంపతులు స్పందిస్తూ ఘటనను తీవ్రంగా ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, శ్రద్ధాకపూర్, రణ్‌దీప్ హుడా, తెలుగు నటి ప్రణీత డిమాండ్ చేశారు. ఏనుగు ప్రాణం తీసిన నిందితుల ఆచూకీ తెలిపితే రూ. 50 వేలు ఇస్తామని హ్యుమన్ సొసైటీ ఇంటర్నేషనల్ ఆఫ్ ఇండియా బహుమతి ప్రకటించింది.