దేశ ఆర్థిక నగరం ముంబైలో కురిసిన భారీ వర్షాలతో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది. ముంబై కల్యాణ్ నగర్‌లో భారీ వర్షం పడుతుండగా, బైక్‌పై వెళ్తున్న ఓ జంట ప్రమాదానికి గురైంది. వర్షపు నీటి కారణంగా రోడ్డుపై వున్న గొయ్యి కనిపించకపోవడంతో బైక్ స్కిడ్ అయ్యింది. అంతే బస్సు కిందకు పోయింది.
రోడ్డు ప్రమాదానికి గురైన యువతి థానే ప్రాంతంలోని ఓ స్కూలులో పనిచేస్తున్న మనీషా బోయిర్‌గా గుర్తించారు. ఈ వీడియోలో తన బంధువు బైక్ నడుపుతూ ఉంటే, ఆమె వెనుక కూర్చుని వర్షంలో తడవకుండా గొడుగు పట్టుకుని వుంది. వారి వాహనం శివాజీ చౌక్ వద్దకు రాగానే, గుంతలో పడింది. ఆపై వీరిద్దరూ కుడివైపునకు పడిపోయారు.