ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ.. పార్లమెంట్ సమావేశాల మధ్య...?

సెల్వి

బుధవారం, 27 నవంబరు 2024 (16:06 IST)
Modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. పార్లమెంట్ భవనంలోని ప్రధాని కార్యాలయంలో ప్రధానితో భేటీ అయ్యారు. 
 
జలజీవన్ మిషన్ అమలులో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ పథకం కాలపరిమితి పొడిగించాల్సిన అంశాలపై మోదీతో చర్చించారు.
 
అంతకుముందు కేంద్రమంత్రి భూపేందర్ యాదవ్‌ను పవన్ కలిశారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో ప్రధాన మంత్రి, కేంద్రమంత్రులతో భేటీ కావడం ఇదే తొలిసారి. 
Modi_Pawan
 
పార్లమెంట్ సమావేశాల మధ్య తన విలువైన సమయాన్ని వెచ్చించినందుకు ప్రధానికి పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు