భారత రాష్ట్రపతి భవన్‌లో కలకలం చెలరేగింది. ఇక్కడ హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేసే ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. ఇది రాష్ట్రపతి భవన్‌లో కలకలం రేపింది. మీడియా వర్గాల సమాచారం మేరకు... రాష్ట్రపతి భవన్‌లోని పారిశుద్ధ్య విభాగంలో పని చేసే ఉద్యోగి ఒకరికి నాలుగు రోజుల క్రితం కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇది పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన్ను ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
అంతేకాకుండా, కార్యదర్శి స్థాయి అధికారులతో పాటు... వారి కుటుంబ సభ్యులను కూడా హోం క్వారంటైన్‌లో ఉంచినట్టు సమచారా. అలాగే, ఇతర పారిశుద్ధ్య కార్మికులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా సెంట్రల్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌కు తరలించారు. ఢిల్లీ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. సుమారు వంద మంది వరకు క్వారంటైన్‌కు పంపించినట్టు తెలుస్తోంది. దీంతో రాష్ట్రపతి భవన్ ఉన్నతాధికారులు కూడా అప్రమత్తమై తగిన చర్యలు తీసుకుంటున్నారు.