కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం

సెల్వి

శనివారం, 1 జూన్ 2024 (16:45 IST)
Modi
కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోదీ 45 గంటల ధ్యానం ముగిసింది. వివేకానంద రాక్ మెమోరియల్‌లో ఆయన మెడిటేషన్ పూర్తి చేశారు. వివేకానంద మండపం బయట, లోపల ధ్యానం చేశారు. కొబ్బరి నీల్లు, ద్రాక్షరసం లాంటి ద్రవపదార్థాలే తీసుకున్నారు. 
 
చేతిలో జపమాల ధరించి మోదీ మండపం చుట్టూ నడిచారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్ నుంచి వెనుదిరిగిన మోదీ... తమిళనాడులోని భగవతి అమ్మాన్ ఆలయంలో పూజలు నిర్వహించారు.
 
శనివారం (జూన్‌ 1) 7వ దశ పోలింగ్‌ అయిపోయే దాకా ఆయన ధ్యానముద్రలోనే ఉంటారన్నమాట. గురువారం సాయంత్రం తిరువనంతపురం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కన్యాకుమారికి చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడ భగవతి అమ్మ ఆలయంలో పూజలు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు