దేశంలో ప్రధాన పారిశ్రామిక నగరంగా గుర్తింపు పొందిన చెన్నై, టెక్ సిటీగా పేరొందిన బెంగుళూరు, పర్యాటక నగరంగా ఉన్న మైసూరును అనుసంధానం చేస్తూ ఈ రైలు సేవలను ప్రారంభించారు. దేశంలో ఇది ఐదో వందే భారత్ రైలు.
ఈ వందే భారత్ రైలు ప్రత్యేకతలను పరిశీలిస్తే,
చెన్నై నుంచి మైసూరు వెళ్లడానికి వందే భారత్ రైలులో చైర్ కార్ ప్రయాణ చార్జీ రూ.1200గాను, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టిక్కెట్ రూ.2295గా నిర్ణయించారు. తిరుగు ప్రయాణంలో మైసూరు నుంచి చెన్నైకు అయితే ఇవే చార్జీల్లో పది శాతం అధికంగా ఉంటాయి.
ఈ రెండు ప్రాంతాల మధ్య 540 కిలోమీటర్లు ఉండగా, ఈ దూరాన్ని ఆరున్నర గంటల వ్యవధిలో చేరుకుంటుంది. మార్గమధ్యంలో కాట్పాడి, బెంగుళూరు స్టేషన్లలో మాత్రమే ఆగుతుంది.