దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్వాతంత్ర్యం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని, కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందన్నారు. ఆకలికేకల భారతావని నేడు ఆహార ధాన్యాల ఎగుమతి స్థాయికి చేరుకుందని గుర్తు చేశారు. వైజ్ఞానిక రంగంలో ఇండియా తన ముద్ర వేస్తున్నదని చెప్పారు.
భారత ప్రజానీకం నవచేతనతో మందడుగు వేస్తున్నది. వచ్చే 25 ఏండ్లు పంచ ప్రాణాలుగా భావించి అభివృద్ధి కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. స్వతంత్ర సమరయోధుల ఆకాంక్షలను సాకారం చేయాలన్నారు. సంపూర్ణ అభివృద్ధి మనముందున్న అతిపెద్ద సవాలని చెప్పారు. మనలో ఏ మూలన దాగివున్న బానిస మనస్తత్వాన్ని వదిలేయాని సూచించారు. సర్వ స్వతంత్ర ప్రజాస్వామ్యంగా మనం నిలబడాలని ఆయన కోరారు.