పైకి నీట్‌గా కనిపిస్తున్న ఈలాడ్జీలో సొరంగంలో వ్యభిచారం బాగోతం బయటపడింది. దీంతో అడ్డుపెట్టిన టేబుల్ చక్కలను తొలగించి చూస్తే.. ఓ జంట మెల్లగా పాక్కుంటూ బయటపడింది. వారిద్దరితో పాటు మరికొందరిని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లాడ్జీలో వ్యభిచారం కోసం ఏకంగా సొరంగం తవ్వారు. ఆ మార్గంలో అమ్మాయిలను లాడ్జీలోకి తీసుకొచ్చి పక్కా దందా చేస్తున్నారు.
ఇన్నాళ్లూ ఇదంతా గుట్టుగానే సాగింది. అయితే, వాడేసిన కండోమ్స్ పెరిగిపోవడంతో వాటన్నింటిని తీసుకొచ్చి రహదారిపై పడేశారు. ఎవరి పాపం వారికే చుట్టుకుంటుంది అన్నట్టుగా.. చేయి దులుపుకోవాలని చూసిన నిర్వాహకులు వాళ్లు చేసిన నిర్వాకంతో అడ్డంగా బుక్కయ్యారు.