కుంభమేళలో పూసలమ్మే మోనాలిసాపై తీవ్ర అసౌకర్యానికి గురవుతోంది. కొందరు పోకిరీలు ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఎగబడుతున్నారు. ఈ క్రమంలో ఆమెప చేతులు వేస్తూ అసభ్యంగా కూడా ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆమె ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంది. పైగా, తమ బిడ్డను కాపాడుకోవడం మోనాసిసా కుటుంబ సభ్యులకు పెద్ద సమస్యగా మారింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా కంటే ఇప్పుడు మోనాలిసాపైనే ప్రజల దృష్టి కేంద్రీకృతమైవుంది. కొందరు భక్తుల తీరు మోనాలిసాతో పాటు కుటుంబ సభ్యులకు ఇబ్బందిగాకరంగా మారింది. మోనాలిసాతో ఫోటోలు తీసుకునేందుకు కొందరు యువకులు ఎగబడుతున్నారు. దీంతో తమ బిడ్డను కాపాడుకునేందుకు కుటుంబ సభ్యులు నానా తంటాలు పడుతున్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరానికి చెందిన మోనలిసా.. ఈ కుంభమేళాలో పూసలు అమ్ముకునేందుకు వచ్చింది. ఆమెను చూసిన ఓ యూట్యూబ్ ఇన్ఫ్లూయెన్సర్ ఆమె ఫోటోలు, వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అప్పటి నుంచి ఆమె ఫేమస్ అయిపోయారు.
కాగా, కుంభమేళాలో తమకు ఎదరువుతున్న పరిస్థితిపై మోనాలిసా కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతకుదెరువు కోసం వస్తే.. ఇలా చేస్తారా? పేదింటి బిడ్డపై ఈ అరాచకం ఏంటి? అంటూ వారు ప్రశ్నిస్తున్నారు.