ముఖ్యంగా పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్‌లో కేసులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో గురువారం సాయంత్రం భేటీ కానున్నారు.
అన్ని రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి, ప్రస్తుత పరిస్థితులు, కోవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపై ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నారు.
కోవిడ్ నివారణ చర్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు ఇచ్చే అవకాశాలున్నాయి. . దీంతోపాటు కరోనా కట్టడికి కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం, కర్ఫ్యూ తదితర అంశాలపై సలహాలు ఇవ్వనున్నారు. కాగా.. దేశంలో ఇప్పటికే కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది.
ఈ క్రమంలో వ్యాక్సిన్ డోసుల సరఫరా.. వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతమయ్యేలా పలు కీలక ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మహారాష్ట్ర, ఢిల్లీలో వీకెండ్, నైట్ కర్ఫ్యూలపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.