స్కూటర్ నుండి పడిపోయిన వ్యక్తి.. పరామర్శించిన రాహుల్

బుధవారం, 9 ఆగస్టు 2023 (17:54 IST)
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ నివాసం టెన్ జన్ పథ్ దగ్గర ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాహుల్ గాంధీ పార్లమెంటు సమావేశానికి వెళుతూ తన తల్లి ఇంటి దగ్గర ఆగారు. అలా వెళ్తుండగా.. రాహుల్ గాంధీ తన స్కూటర్ నుండి పడిపోయిన వ్యక్తిని గమనించారు.
 
ఏమాత్రం సంకోచించకుండా, అలాగే భద్రతను లెక్కచేయకుండా రాహుల్ గాంధీ ఆ వ్యక్తికి గాయమైందో లేదో చూసేందుకు దగ్గరకు వెళ్లారు. అతను బాగానే ఉన్నానని హామీ ఇవ్వడంతో అక్కడ నుంచి పార్లమెంటుకు బయల్దేరి రాహుల్ గాంధీ వెళ్లారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు