ఇండోర్‌లో భారత్ జోడో యాత్ర.. బాంబులతో చంపేస్తామంటూ..?
శుక్రవారం, 18 నవంబరు 2022 (17:07 IST)
కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీని బాంబులతో లేపేస్తామంటూ బెదిరింపు లేఖలతో హెచ్చరించారు. ప్రస్తుతం భారత్ జోడో యాత్రలో వున్న రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ చేరుకున్నారు. బాంబులతో చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి.
జోడో యాత్ర సాగే మార్గంలోని జుని పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మిఠాయి దుకాణం వద్ద ఈ బెదిరింపు లేఖను గుర్తించారు. పాదయాత్ర ఇండోర్‌లోకి ప్రవేశించగానే.. నగర వ్యాప్తంగా బాంబు పేలుళ్లకు పాల్పడతామని.. రాహుల్‌తో పాటు మాజీ సీఎం కమల్ నాథ్‌ను చంపుతామని ఆ లేఖలో పేర్కొన్నారు.
దీంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. స్వీట్ షాపులో లేఖను వదిలి వెళ్లిన వ్యక్తి కోసం ఇండోర్ పోలీసులు, క్రైమ్ బ్రాంచ్ సిబ్బంది వెతుకుతున్నారు. జూని ఇండోర్ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో అమర్చిన సీసీటీవీ ఫుటేజీని నిశితంగా పరిశీలిస్తున్నారు పోలీసులు.