భారత్ రాష్ట్ర సమితి పేరుతో జాతీయ పార్టీగా మారిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం సాగుతోందన్నారు. ఇందులో ఒక భావజాలం దేశాన్ని విభజించి హింసను అంతటా వ్యాపింపజేయడమే లక్ష్యంగా పెట్టుకుంటే, మరో భావజాలం దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా సాగుతోందన్నారు.
'కాంగ్రెస్ పార్టీ మాదిరిగానే, ప్రతిపక్షాలు సామరస్యపూర్వకంగా సహకరించడం, బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్-తత్వశాస్త్రాన్ని ఓడించడం చాలా కీలకమని నేను నమ్ముతున్నాను' అని ఆయన అన్నారు.