ప్రత్యర్థులను కూడా గురువులుగా భావిస్తున్నా : రాహుల్ గాంధీ

మంగళవారం, 5 సెప్టెంబరు 2023 (15:35 IST)
తన ప్రత్యర్థులను సైతం గురువులుగా భావిస్తున్నట్టు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబరు 5వ తేదీన గురుపూజోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ రాహుల్ గాధీ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ఎంతో మంది మహానుభావుల నుంచి సమాజాన్ని ప్రేమించడం నేర్చుకున్నానని, వారితో పాటు ప్రత్యర్థులను కూడా గురువులుగా భావిస్తున్నానని అన్నారు. 
 
'దేశంలోని ఉపాధ్యాయులందరికీ నా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు ఘన నివాళి అర్పిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎంతో ముఖ్యమైంది. మహాత్మ గాంధీ, నారాయణ గురు, గౌతమ బుద్ధుడు నా గురువులు. సమాజంలోని ప్రతి ఒక్కరి పట్ల కరుణ, ప్రేమ, సమానత్వం చూపాలనే జ్ఞానాన్ని వారి నుంచే పొందాను. అదే విధంగా నా ప్రత్యర్థులను కూడా గురువులుగా భావిస్తున్నాను. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. వారి ప్రవర్తన, అబద్ధపు మాటల ద్వారా నేను అనుసరిస్తున్న మార్గం ఖచ్చితంగా సరైనదేనని బోధిస్తుంటారు. అందుకే వారిని కూడా నా గురువులుగా భావిస్తున్నాను' అని రాహుల్‌ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు