రాహుల్ గాంధీ పంచ న్యాయ్ బ్రోచర్లను ప్రయాణికులకు పంచి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకంపై ఆరా తీశారు. ప్రయాణీకులతో ముచ్చటించిన రాహుల్ గాంధీ మహిళలు, యువత, రైతులు, కార్మికులు వంటి వివిధ వర్గాల కోసం కాంగ్రెస్ తన జాతీయ మేనిఫెస్టోలో చేసిన వాగ్దానాలను వారికి వివరించారు.
రాహుల్ గాంధీ తమతో పాటు ప్రయాణిస్తున్నట్లు చూసిన ప్రయాణికులు ఆశ్చర్యానికి లోనవగా, పలువురు ఆయనతో సెల్ఫీలు దిగారు. అంతకుముందు, రాహుల్ గాంధీ బహిరంగ సభలో తన ప్రసంగంలో, రాజ్యాంగాన్ని తొలగించడానికి బిజెపి యోచిస్తోందని ఆరోపించారు. దానిని పరిరక్షిస్తానని ప్రతిజ్ఞ చేశారు.