తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గట్టివార్నింగ్ ఇచ్చారు. లాక్‌డౌన్ సమయంలో మద్యం విక్రయాలు వద్దనీ, తక్షణం మద్యం దుకాణాలను మూసివేయాలంటూ మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వీటిపై ప్రభుత్వం అప్పీల్ చేసింది.
కాగా, తమిళనాడులో మద్యం దుకాణాలను మూసివేయాలంటూ ప్రభుత్వానికి రెండు రోజుల క్రితం మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి దీనిపై స్టే కోరుతూ శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆన్‍లైన్ ద్వారా మద్యం విక్రయించడం, డోర్ డెలివరి చేయడం సాధ్యం కాదని తన పిటిషన్‌లో పళనిస్వామి తెలిపారు.