కోర్టు ప్రాంగణంలో క్లయింట్‌ను కాలితో తన్నిన లాయర్.. (Video)

గురువారం, 21 సెప్టెంబరు 2017 (05:51 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పామరులో కాదు.. ఉన్నత చదువులు చదువుకున్న విద్యావంతులు కూడా విచక్షణ మరిచిపోతున్నారు. ఫలితంగా, ఆగ్రహంతో రగిలిపోతూ, సభ్యసమాజం తలదించుకునే చర్యలకు పాల్పడుతున్నారు. 
 
తాజాగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ లాయర్ తన క్లయింట్‌ను కోర్టు ముందే తన్ని హల్‌చల్ సృష్టించాడు. ఈ ఘటన రాంపూర్‌లో చోటుచేసుకుంది. చలానాకు సంబంధించిన సెటిల్‌మెంట్ కేసులో ఫీజు ఇవ్వడం లేదని లాయర్ కోర్టు ప్రాంగణంలోనే తన క్లయింటును కాలుతో తన్నాడు. సదరు క్లయింట్ పరుగెడుతుండగా మధ్యలో మరో లాయర్ కలగజేసుకుని అతన్ని కొట్టాడు. 
 
ఫీజు ఇవ్వడం లేదని లాయర్ అంటుండగా.. క్లయింట్ మాత్రం తాను చలానా సెటిల్‌మెంట్ కోసం లాయర్‌కు రూ.5000 ఫీజు ఇచ్చానంటున్నాడు. డబ్బులు తీసుకుని పనిచేయకపోవడంతో లాయర్‌ను ఫీజు తిరిగివ్వాలని అడిగితే తనపై దాడికి పాల్పడ్డారని క్లయింట్ ఆవేదన వ్యక్తం చేశాడు. లాయర్ క్లయింట్‌ను కాలుతో తన్నిన వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోనూ మీరూ చూడండి. 

 

#WATCH Rampur: Lawyer kicks his client following dispute over his fees to settle a 'Chalan' issued in client's name pic.twitter.com/fOJuBgNMH3

— ANI UP (@ANINewsUP) September 20, 2017

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు