దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు: భద్రత వలయంలో హస్తినాపురి

శుక్రవారం, 26 జనవరి 2018 (09:23 IST)
దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్స వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం ఢిల్లీలో జరుగుతున్న గణతంత్ర వేడుకలకు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల కోసం ఢిల్లీ నగరం మొత్తాన్ని భద్రతా సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 
 
దాదాపు 50 వేల మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారని తెలుస్తోంది. మరోవైపు కాశ్మీరులో హై అలర్ట్‌ ప్రకటించారు. 18 ఏళ్ల కశ్మీరేతర యువతి గణతంత్ర వేడుకలే లక్ష్యంగా ఆత్మాహుతి దాడికి తెగబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు
 
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్‌లో గణంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి అమరవీరుల స్థూపానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు.
 
పరేడ్‌ గ్రౌండ్స్‌లో గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఏపీలోనూ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇకపోతే.. జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు