బెంగుళూరులో మాస్క్ లేని వారి నుంచి కోటి రూపాయలు జరిమానా

మంగళవారం, 14 జులై 2020 (20:48 IST)
కరోనా వేళ తప్పనిసరిగా మాస్క్ వేసుకోవాలి అనే నిబంధన ఉల్లంఘించిన వారి నుంచి కేవలం నెల రోజుల వ్యవధిలో కోటి రూపాయల జరిమానా వసూలయింది. బెంగళూరు నగర వ్యాప్తంగా మాస్కులు లేని వారి నుంచి ట్రాఫిక్ పోలీసులు, బీబీఎంపీ మార్షల్స్ తరచు తనిఖీలు కొనసాగించారు.
 
జూన్ నెలలో కోటి రూపాయల జరిమాన వసూలు అయినట్లు బీబీఎంపీ అధికారులు ప్రకటించారు. మాస్కులు లేని వారు, భౌతిక దూరం పాటించని 50,706 మందికి బీబీఎంపీ మార్షల్స్ జరిమానా విధించారు. రూ. 1.01 కోట్లు వసూలు అయింది. ఒక్కొక్కరి నుంచి 200 రూపాయలు వసూలు చేశారు.
 అదే తరహాలోనే చెత్త విభజన చేయని 149 దుకాణాలకు జరిమానా విధించినట్లు ప్రకటించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు