తమిళనాట దివంగత సీఎం జయలలితను ఆమె ఫ్యాన్స్ మరిచిపోయారని టాక్ వస్తోంది. జయలలితకు క్రేజ్ తగ్గిపోయిందని.. ఆమె నెచ్చెలి శశికళకు క్రేజ్ అమాంతం పెరిగిపోతోందని సమాచారం. అందుకు కారణం అమ్మ సమాధి దగ్గర కన్నా ఇప్పుడు పోయెస్ గార్డెన్ లో శశికళను పరామర్శించే వారి సంఖ్య రెట్టింపవుతోంది. మెరినా బీచ్‌లోని అమ్మ సమాధి దగ్గర ఐదు వేల మంది అభిమానులు ఉంటే పోయెస్ గార్డెన్‌లో శశికళను పరామర్శించే వారి సంఖ్య మరింత ఎక్కువైందని టాక్ వస్తోంది.
అన్నాడీఎంకే కార్యకర్తలు మాత్రమే శశికళకు విరుద్ధమైతే.. ప్రజలు మాత్రం శశికళకు దగ్గరవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తమిళనాడులోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు చిన్నమ్మా మీరే దిక్కు అంటూ ఆమె కాళ్లమీద పడిపోతున్నారు. అయితే దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఎన్నో సంవత్సరాల నుంచి పోయెస్ గార్డెన్‌లోని జయలలిత నివాసం ఉంటున్న వేదనిలయంలో ఒక్కసారైనా అడుగుపెట్టాలని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆశగా ఉంటుంది.
కార్యకర్తలు వేదా నిలయం గుమ్మం ముందు క్యూకడుతున్నారు. ప్రతి రోజూ కొన్ని వేలమంది శశికళను ఓదార్చడానికి, పరామర్శించడానికి వస్తున్నారు. నగదు డ్రా చేసుకోవడానికి బ్యాంకుల దగ్గర క్యూ కన్నా, జయలలిత సమాధిని దర్శించుకోవడానికి వచ్చే వారి సంఖ్య కన్నా ఇప్పుడు పోయెస్ గార్డెన్ లోని వేద నిలయం ముందు శశికళను పరామర్శించడానికి క్యూ ఎక్కువగా ఉంది. దీంతో అమ్మ కంటే చిన్నమ్మకే క్రేజ్ బాగా పెరిగిపోతోంది.