ఒకవైపు డేరా అధినేత గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్త పుత్రిక హనీప్రీత్ ఇన్సాన్ పోలీసులకు టోకరా వేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందనే వార్తలు తిరుగుతుంటే హనీ మాత్రం ఢిల్లీ హైకోర్టులో ఓ పిటీషన్ వేసి పోలీసులకు షాకిచ్చింది. తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ ఆ పిటీషన్లో పేర్కొంది. అంతేకాదు... తనను డ్రగ్స్ మాఫియా హతమార్చే అవకాశం వుందనీ, తన ప్రాణాలకు ముప్పు వున్నదంటూ ఆమె తన పిటీషన్లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో హనీ పిటీషన్ మంగళవారం మధ్యాహ్నం కోర్టు విచారణకు రానుంది.