ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో తొలిసారిగా 2 వేల రూపాయల నోటును చలామణిలోకి తెచ్చారు. ఈ నోటును త్వరలోనే రద్దు చేయబోతున్నారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ ప్రచారానికి మరింతబలం చేకూర్చేలా రూ.2 వేల నోటు ముద్రణను కేంద్రం నిలిపివేసింది. దీంతో త్వరలోనే రూ.2 వేల నోటును రద్దు చేయవచ్చనే ఊహాగానాలు వినొస్తున్నాయి.
దేశంలో నల్లధనం అరికట్టే చర్యల్లో భాగంగా, గత 2016 నవంబరు 8వ తేదీన రూ.500, రూ.1000 నోట్లను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.500 నోటుతా పాటు రూ.2000 నోటును చలామణిలోకి తెచ్చారు. నాడు ప్రధాని పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రతి ఒక్కరూ అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఈ నిర్ణయంపై దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ ఆర్థిక నిపుణుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి.