భార్యను స్నేహితులతో రేప్ చేయించిన భర్త.. ఎందుకు?

సోమవారం, 31 జులై 2017 (12:06 IST)
అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భార్యను ఓ కసాయి భర్త తన స్నేహితులతో రేప్ చేయించాడు. ఈ కామాంధులంతా కలిసి భార్యపై అత్యాచారం చేస్తుంటే.. ఆ కిరాతక భర్త చూస్తూ ఆనందించాడు. ఈ దారుమం హర్యానా రాష్ట్రంలోని శిర్సాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
శిర్సా పట్టణంలో నివశించే ఓ వ్యక్తి తన భార్య నుంచి విడాకులు కోరాడు. అందుకు భార్య అంగీకరించలేదు. దీంతో కోపంగా వెళ్లిన భర్త తన ముగ్గురు స్నేహితులను ఇంటికి పంపించి భార్యనే కిడ్నాప్ చేయించాడు. ఆ తర్వాత ఆమెను పంట పొలాల్లోకిలాక్కెళ్లి సామూహిక అత్యాచారం చేసి నగ్నంగా పొలాల్లో వదిలి వెళ్లారు.
 
అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త చేసిన దురాగతంపై భర్తతోపాటు అతని ముగ్గురు స్నేహితులు, అత్త, భర్త చెల్లెలిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి