మాతృభాషలను పరిరక్షించాలి : కంచి పీఠాధిపతి విజయేంద్ర పిలుపు

సోమవారం, 24 అక్టోబరు 2022 (16:19 IST)
మాతృభాషలను పరిరక్షించాలని కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పిలుపునిచ్చారు. ఆయన దీపావళి పండుగను పురస్కరించుకుని ధర్మ సందేశాన్ని ఇచ్చారు. ధర్మాన్ని విడనాడకుండా మంచి పనులు చేద్దామని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
 
"ముందుగా మాతృభాషను కాపాడాలి. ప్రతి ఒక్కరూ మాతృభాషను నేర్చుకోవాలన్నదే తన అభిప్రాయమన్నారు. మాతృభాషను కాపాడండి. మాతృభాష అంటే కేవలం తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం మాత్రమే కాదు. వారివారి భాషలో మాతృభాషలు, వీటన్నింటిని పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. 
 
భారత నేలపై ఉండే కుటుంబ జీవితంలో ఉండే భక్తి, నిస్వార్థం, ఇతరుల సంక్షేమం, తల్లి లక్షణాలు, బాధ్యతలు, విలువలను కాపాడేందుకు మాతృభాషను కాపాడుకోవాలి అని పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు