మహారాష్ట్రలోని శివసేన - కాంగ్రెస్ - ఎన్సీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టి, ఏక్నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ - శివసేన చీలిక వర్గం ఎమ్మెల్యేలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు. ఆ రాజకీయ సంక్షోభ సమయంలో గవర్నర్ వ్యవహరించిన తీరు ఏమాత్రం సరికాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాచారం లేనపుడు సభలో మెజార్టీని నిరూపించుకోమనడం సబబు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే, ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా నేపథ్యంలో ఏక్నాథ్ షిండే ప్రమాణ స్వీకారం సమర్థనీయమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేసమయంలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని ఇపుడు పునరుద్ధరించలేమని వ్యాఖ్యానించింది. దీనికి కారణం లేకపోలేదన్నారు.
ఉద్ధవ్ ఠాక్రే మెజార్టీ కోల్పోయారన్న నిర్ధారణకు రావడానికి గవర్నర్ వద్ద తగిన సమాచారం లేనపుడు సభలో మెజార్టీని నిరూపించుకోవాలని ప్రభుత్వాన్ని పిలవడం సరికాదని, కానీ, ఉద్ధ్ ఠాక్రే బలపరీక్షను ఎదుర్కోకుండానే రాజీనామా చేయడంతో తిరిగి ఆయన ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని కోర్టు తెలిపింది.