చిక్కుల్లో నయనతార దంపతులు - నేరం రుజువైతే ఐదేళ్ల జైలు?

బుధవారం, 12 అక్టోబరు 2022 (16:07 IST)
స్టార్ హీరోయిన్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్‌లు ఇపుడు చిక్కుల్లో పడ్డారు. ఇటీవల సరోగసీ విధానం ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ విషయం వెలుగురాగానే పెద్ద వివాదాస్పదమైంది. వివాహమైన ఐదేళ్ళ తర్వాతే సరోగసీ విధానం ద్వారా సరోగసీ విధానం ద్వారా పిల్లలను కనాల్సివుంది. కానీ, ఈ దంపతులు ఐదు నెలలు కూడా పూర్తికాకముందే తమకు కవల మగ పిల్లలు జన్మనించినట్టు ప్రకటించారు. ఇది పెద్ద వివాదానికి దారితీసింది. దీంతో ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను సమర్పించాలని నయనతార దంపతులకు ఆ రాష్ట్ర మెడికల్ డైరెక్టర్ నోటీసులు జారీచేశారు. 
 
ఇదిలావుంటే, అద్దె గర్భం ద్వారా పిల్లలను కనడమే సరోగసీ విధానం. దీనిపై 2019లోనే సుప్రీంకోర్టు స్పష్టతను ఇచ్చింది. ఈ పద్ధతి ద్వారా పిల్లలను కనడం నేరమని తీర్పును వెలువరించింది. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా నయనతార అద్దె గర్భం ద్వారా పిల్లలకు జన్మనిచ్చింది. 
 
ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ సరోగసీ ద్వారా పిల్లలను కన్నట్టయితే నయనతార, విఘ్నేష్ లకు ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఒకవేళ సరోగసీ ద్వారా కాదు... పిల్లలను దత్తత చేసుకున్నామని చెప్పినా సమస్యలు తప్పవు. 
 
పిల్లలను దత్తత తీసుకోవాలంటే న్యాయపరంగా ముందుకు వెళ్లాల్సిఉంది. చట్టపరంగా దత్తత తీసుకుంటే పర్వాలేదు... లేని పక్షంలో చట్టాన్ని ఉల్లంఘించినట్టే అవుతుంది. మరోవైపు ఇంత జరుగుతున్నా నయన్ దంపతులు స్పందించకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు