2019-20 సంవత్సరానికి కేంద్రం ఉద్యోగులకు బోనస్ ను ప్రకటించింది. సుమారు 30.67 లక్షల మంది నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడిన, ఉత్పాదకేతర బోనస్ ను దసరాకు ముందుగానే ఇచ్చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.
దీని వల్ల ఖజానాపై పడే భారం రూ.3,737 కోట్లు. రైల్వేలు, పోస్టాఫీసులు, ఈపీఎ్ఫవో, ఈఎ్సఐసీ, రక్షణ రంగాల్లో పనిచేస్తున్న 16.97 లక్షల మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు ఉత్పాదకతతో ముడిపడ్డ బోనస్ (పీఎల్బీ), 13.70 మంది ఎన్జీవోలకు ఉత్పాదకతతో సంబంధం లేని (నాన్ పీఎల్బీ) తాత్కాలిక బోనస్ లభిస్తుందని సమాచార మంత్రి ప్రకాశ్ జావడేకర్ చెప్పారు.