వివరాల్లోకి వెళితే.. చెన్నై, తాంబరం సమీపంలోని సంతోషపురం పార్కు వీధికి చెందిన రాజన్ పాఠశాలలో వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఇతని భార్య సీతాలక్ష్మి సంతోషపురం ప్రాంతంలో జిరాక్స్ షాపు నడుపుతున్న ఐవర్‌రాజ్‌తో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగించింది.
ఈ విషయం తెలిసి భర్త మందలించాడు. దీంతో పుట్టింటికి వెళ్ళిపోయింది. కాపురానికి రమ్మని... తప్పును సరిదిద్దుకోమని భర్త చెప్పాడు. కానీ ప్రియుడు ఐవర్‌రాజ్‌తో కలిసి జీవిస్తానని, కాపురానికి రానని చెప్పడంతో చెప్పేసింది. దీంతో మనస్తాపం చెందిన రాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు.
రాజన్ ఆత్మహత్యకి కారణమైన సీతాలక్ష్మిని, ఐవర్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు. తన చావుకు భార్య, ఆమె ప్రియుడు ఐవర్‌రాజ్ కారణమని రాజన్ రాసిన సూసైట్‌నోట్ పోలీసులకు లభ్యమైంది.