అయితే, ఎల్‌కేజీ, యూకేజీ, ప్లేస్కూళ్లను తెరిచేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు ప్రభుత్వం. కోవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టడంతో నిబంధనలను సడలించింది. కొత్త నిబంధనల ప్రకారం వివాహాలకు వచ్చే అతిథుల సంఖ్య వందమందిగా నిర్ణయించగా, అంత్యక్రియలకు 50 మందిని మాత్రమే అనుమతిస్తారు.
ప్రార్థనా స్థలాలు అన్ని రోజులు తెరిచి ఉంచడానికి అనుమతించబడతాయి. హోటళ్లు, అతిథి గృహాలు 50 శాతం వినియోగదారులకు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ ఆదివారం (జనవరి 30) పూర్తిగా లాక్‌డౌన్ ఉండదని, దానిని ఉపసంహరించుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.