తెలంగాణ ఎన్నికలు : కాంగ్రెస్ మూడో జాబితా.. కామారెడ్డిలో రేవంత్
మంగళవారం, 7 నవంబరు 2023 (08:17 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సోమవారం రాత్రి 16 మంది అభ్యర్థులతో మూడో జాబితాను వెల్లడించింది. ఇందులో టీపీసీ చీప్ రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. 16 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను ఆ పార్టీ రిలీజ్ చేసింది.
ఈ జాబితాలో నిజామాబాద్ పట్టణ సీటును మాజీ మంత్రి షబ్బీర్ అలీకీ కేటాయించింది. ఇక చెన్నూరు నుంచి జి.వివేక వెంకటస్వామి పోటీ చేస్తున్నట్టు తెలిపింది. రెండు సీట్లలో అభ్యర్థులను మార్చుతూ పార్టీ నిర్ణయం తీసుకుంది. బోథ్ నియోజకవర్గంలో అశోక్ స్థానంలో ఆదె గజేందర్, వనపర్తిలో చెన్నారెడ్డి స్థానంలో మేఘా రెడ్డికి సీట్లు కేటాయిస్తూ మార్పులు చేసింది. మరోవైపు, పొత్తులో భాగంగా, కొత్తగూడెం సీటును సీపీఐకు కేటాయించింది.
తాజా జాబితాతో మొత్తం 114 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. తుంగతుర్తి, సూర్యాపేట, మిర్యాలగూడ, చార్మినార్ స్థానాలకు మాత్రం అభ్యర్థులను ఖరారు చేయాల్సివుంది. కాగా, అధికార భారాస నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి స్థానం నుంచి బరిలోకి దిగుతున్న విషయం తెల్సిందే. ఇపుడు ఇక్కడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేస్తుండటం ఇపుడు ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ ప్రకటించిన మూడో జాబితాలోని అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తే,