దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఇదొక కామెడీ డ్రామా. చిత్రంలోని ప్రతి పాత్ర ఎంటర్‌టైన్ చేస్తుంది. ఎం.ఎస్ చదవడానికి విదేశాలకు వెళ్లినప్పుడు ఐదుగురు చిన్ననాటి స్నేహితులకు జరిగిన సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ఈ సినిమా సహజత్వం కోసం సింక్ సౌండ్ వాడాం. కంటెంట్‌తో పాటు మంచి టెక్నికల్ వాల్యూస్‌తో ఈ చిత్రం వుండబోతుంది. ఒక మంచి క్వాలిటీ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించడానికి ప్రయత్నించాం. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు.
రవికృష్ణ, సమీర్ మళ్లా, రాజీవ్‌కనకాల, ప్రమోదిని, వాకా మని, రాజా అశోక్, వెంకటేష్, సాయి అరుణ్, రాహుల్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఐ.భరత్, డీఓపీ : సంకీర్త్ రాహుల్, సంగీతం: ప్రశాంత్ శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైనర్: ఏఆర్ వంశీ.జి, ఎడిటర్: నరేష్ ఆడుపా, సింక్ సౌండ్ డిజైన్:సాయి మణిధర్ రెడ్డి, సౌండ్ మిక్సింగ్: అరవింద్ మీనన్, మేకప్ చీఫ్:వెంకట్ రెడ్డి, డిజిటల్ మార్కెటింగ్: ఫస్ట్ షో, పీఆర్ ఓ: ఏలూరు శ్రీను, మడూరి మధు