అసలు విషయానికి వస్తే... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం తింటారనే ఆసక్తి చాలామందిలో వుంటుంది. ప్రధాని శాకాహారానికి ప్రాధాన్యత ఇస్తారట. ఆవు నెయ్యితో తయారుచేసిన కిచిడీ, ఉడికించిన కూరగాయలను తింటారట. ఇంకా పండ్లు, రొట్టెలు, పుల్కా, పప్పు, కూరగాయలు వంటివి ఆయన భోజనంలో వుంటాయట. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆయన తినే భోజనం ఖరీదు రూ. 50 మించదట. ఎలాంటి దర్పాలకు పోకుండా సాదాసీదాగా ఆయన అలవాట్లు వుంటాయని చెబుతున్నారు.