వరదల్లో నిండు గర్భిణిని ఆసుపత్రికి... నేవీ ఆసుపత్రిలో మగబిడ్డ

శుక్రవారం, 17 ఆగస్టు 2018 (19:20 IST)
కేరళ వరదల కారణంగా ఇప్పటికే 300 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కేరళ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు భారత ఆర్మీ, నౌకాదళాలు కూడా తమ వంతుగా సహాయక చర్యలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటికే ఎంతో మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగా ఈరోజు 25 ఏళ్ల సజీత జబీల్ నిండు గర్భిణిని వైద్యులు పరీక్షించి, వైద్య సహాయం అందించడానికి నేవీ సహాయం కోరారు. 
 
వెంటనే ఆమెను తన స్వగ్రామమైన ఆలువా నుండి హాస్పిటల్‌కి చేర్చారు. నేవీ అధికారి CDR విజయ వర్మ ఆ సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షించారు. ఆమె సురక్షితంగా హాస్పిటల్‌కు చేరడమే కాకుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 
నేవీ అధికారులు తీసిన ఒక వీడియోని మరియు చంటి బిడ్డ ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచడంతో నెటిజన్లు నేవీకి, అలాగే సహాయక చర్యలలో పాల్గొంటున్న వారందరినీ అభినందిస్తున్నారు. వరదల్లో చిక్కుకున్న కేరళ మళ్లీ యథాస్థితికి చేరుకోవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు