తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ రాష్ట్రంలోని సరపరి అనే గ్రామానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరికీ పెళ్ళిళ్లు కావడంతో వేర్వేరుగా ఉంటూ పొలం పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు.
అయితే, చిన్న కుమారుడు శతృఘ్న మహంత (39) తన పొలం కాలీఫ్లవర్ పంటను సాగుబడి చేశాడు. దీంతో కన్నతల్లి కూర వండుకునేందుకు ఓ కాలీఫ్లవర్ కోసింది. ఈ విషయం తెలుసుకున్న కొడుకు.. తన అనుమతి లేకుండా కాలీఫ్లవరు ఎందుకు తెంపావని దుర్భాషలాడుతూ తల్లిని నిలదీశాడు. అంతటితే ఆగకుండా ఆమె వీధిలో కరెంట్ స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా చావబాదాడు. గ్రామస్థుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి మహంతను అరెస్టు చేశారు.